కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదివారం దర్శించుకున్నారు. అన్నవరం: కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదివారం దర్శించుకున్నారు. ప్రధానాలయంలో స్వామి దర్శనం తర్వాత యంత్రాలయంలో ప్రదక్షణ చేశారు. మర్యాద పూర్వకంగా మంత్రికి అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా, ప్రజలంతా సుఖ సంతోషంగా ఉండాలని స్వామి వారిని వేడుకున్నట్లు ఆమె తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.