విశాఖపట్నం విమానాశ్రయంలో భారీగా హైడ్రోపోనిక్ గంజాయి పట్టుబడటం కలకలం రేపింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద సుమారు రూ.4 కోట్ల విలువైన గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం, అక్టోబర్ 25: నగరంలోని విమానాశ్రయంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు చేపట్టిన తనిఖీల్లో భారీగా హైడ్రోపోనిక్ గంజాయి పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద సుమారు రూ.4 కోట్ల విలువైన గంజాయిని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల తనిఖీల సందర్భంగా ఈ అక్రమ రవాణా వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.