ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అన్నాచెల్లెళ్లు మృతి చెందడం గుంటూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. గుంటూరు కొత్తపేటకు చెందిన సౌపాటి సాత్విక్, నిత్య అనే అన్నాచెల్లెళ్లు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వీరిద్దరి మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అన్నా చెల్లెలు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. బ్రాహ్మణ కోడూరుకు చెందిన రాంబాబు, స్వర్ణ దంపతులకు పదేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి సాత్విక్, నిత్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత 2022లో స్వర్ణ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.