డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ విశ్రాంత ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 1.17 కోట్లు కాజేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని న్యూ మెట్టుగూడలో చోటుచేసుకుంది. హైదరాబాద్, అక్టోబర్ 25: నగరంలో సైబర్ నేరగాళ్లు మరోసారి విజృంభించారు. ఇటీవలే రిటైర్డ్ అయిన ఓ ఉద్యోగిని లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసానికి పాల్పడ్డారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..హైదరాబాద్ నగరంలోని న్యూమెట్టుగూడకు చెందిన 71 ఏళ్ల ఆగ్నేస్ ఫ్రాన్సిస్.. ఈసీఐఎల్లో సీనియర్ పర్చేజ్ ఆఫీసర్గా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ పొందారు.