హైదరాబాద్ జలమండలి అధికారి కారులో రూ.2.40 లక్షల నగదు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్: హైదరాబాద్ జలమండలి (HMWSSB) అధికారి కారులో రూ.2.40 లక్షల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎ.శ్రీనివాస్ కారులో వస్తుండగా.. శనివారం రాత్రి 7 గంటల సమయంలో రాజ్‌భవన్ రోడ్డులోని మెట్రో రెసిడెన్సీ అపార్ట్మెంట్స్ సమీపంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. లెక్కల్లో చూపని రూ.2.40 లక్షల నగదు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి శ్రీనివాస్ ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఏసీబీ అధికారులు..