ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు దగ్గర పడుతుండడంతో అధికారులు, నేతల పనితీరుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దిశ, వరంగల్ బ్యూరో : ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు దగ్గర పడుతుండడంతో అధికారులు, నేతల పనితీరుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆయా నియోజకవర్గాలు, మండలాలు, జిల్లాల పరిధిలోపథకాల అమలు, వారి పనితీరుపై ఆరా తీస్తున్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం అవుతున్నాయా లేవా అనే అంశాలపై పలు ఏజెన్సీల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. ఆ నివేదికల ఆధారంగా ఆయా నియోజకవర్గాలపై అవగాహనకు రావడంతో పాటు నేతల పనితీరును అంచనా వేస్తున్నారు. సీఎం ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు, నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.