వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని నెహ్రూ సెంటర్లో ఆదివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని నెహ్రూ సెంటర్లో ఆదివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి లక్ష్మీ ఆటోమొబైల్స్, హకా ఫార్మసీ సర్వీసెస్ (ఫర్టిలైజర్) దుకాణాలను పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో రెండు దుకాణాల్లో కలిపి దాదాపు రూ.70 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని దుకాణ యజమానులు తెలిపారు.