ఎల్నినో నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. నీటి వృథాపై రూ.5 వేల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వరంగల్, అక్టోబర్ 25: ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో నీటి ఎద్దడి ఏర్పడుతున్న నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. నీటి వృథాపై భారీగా జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.‘ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో నీటి ఎద్దడి ఏర్పడింది. తాగునీరు, సాగునీరు కోసం ప్రజలు ఇబ్బందులు పడాల్సివస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో ఎల్నినో ప్రభావం మరింత తీవ్రతరం కాకముందే ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.