జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల సందడి కనిపిస్తోంది. ఏ ఇద్దరు కలిసినా ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నవంబరు 1న జరగనుంది. జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల సందడి కనిపిస్తోంది. ఏ ఇద్దరు కలిసినా ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నవంబరు 1న జరగనుంది. అభ్యర్థులు ఇంటింటి పర్యటనలు, సభలు, సమావేశాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం ముగిసింది. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికలు ముగియగానే పంచాయతీ పోరు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల దృష్టి యువ ఓటర్లపైనే ఉంది.