స్థానిక ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లావ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. మాధవధార, న్యూస్టుడే: స్థానిక ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లావ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మీ వ్యక్తిగత అవసరాలకు రూ.49 వేలకు మించి నగదు తీసుకెళ్తూ అధికారులు తనిఖీల్లో బయటపడితే తప్పనిసరిగా ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులైతే ఎంత తక్కువ నగదు ఉన్నా ఆధారాలు చూపించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. లేకపోతే ఓటర్లను మభ్య పెట్టేందుకు నగదు రవాణా చేస్తున్నట్లు భావించి వెంటనే స్వాధీనం చేసుకుంటారు.