వరంగల్ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రారంభం కావాల్సిన ఓపీ సేవలు వాయిదా పడటంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వైద్యసేవలపరంగా సంసిద్ధత నేపథ్యంలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్న క్రమంలో మరికొన్ని రోజులు వాయిదా వేయాల్సి వచ్చిందంటూ అధికారులు చెప్పుకొచ్చారు. ఈనాడు, వరంగల్: వరంగల్ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రారంభం కావాల్సిన ఓపీ సేవలు వాయిదా పడటంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. 24 అంతస్తుల భవనంలో రెండంతస్తుల్లో పండగ రోజున ఓపీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి.. ఆయా విభాగాలకు సంబంధించి ఇన్‌పేషెంట్ల(ఐపీ)కు ఎంజీఎం, కంటి ఆసుపత్రి, సీకేఎం, ప్రసూతి ఆసుపత్రుల్లో ఉంచి శస్త్రచికిత్సలు అందించాలని నిర్ణయించారు.