ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా బండరాళ్లను పేల్చేందుకు ఏర్పాటు చేసిన పేలుడు పరికరం మిస్‌ఫైర్ కావడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు కార్మికులు, ఒక వాహన డ్రైవర్‌తో పాటు ఓ టీచర్ ఉన్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. ఈ ఘోర ప్రమాదంపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అధికారుల నుంచి వివరాలు సేకరించి, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రోడ్డు పనుల్లో పేలుడు.. ఐదుగురు మృతి ప్రస్తుతం అనంతగిరి మండలం పినకోట సమీపంలో రోడ్డు పనులు జరుగుతున్నాయి.