అల్లూరి జిల్లాలోని అనంతగిరి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈరోజు ఉదయం పినకోట వద్ద మైనింగ్ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. అల్లూరి జిల్లా, అక్టోబర్ 24: జిల్లాలోని అనంతగిరి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈరోజు(శనివారం) ఉదయం పినకోట వద్ద మైనింగ్ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. వాహనంలో డీజిల్ నింపుతుండగా మంటలు అంటుకుని పేలుడు జరిగింది. ఓ ఉపాధ్యాయురాలు కూడా ప్రాణాలు కోల్పోయారు.టీచర్ సునీత పాఠశాలకు వెళ్తున్న సమయంలో బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్నారు. వాహనం నుంచి టిప్పర్‌కు డీజిల్ నింపుతుండగా మంటలు అంటుకొని రహదారి నిర్మాణానికి తీసుకెళ్తున్న జిలెటిన్ స్టిక్స్ ఒక్కసారిగా పేలాయి.