ప్రజల భద్రతకు ముప్పు కలిగిస్తూ, ఎలాంటి అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించకుండా చట్టవిరుద్ధంగా బాణాసంచా తయారుచేస్తూ విక్రయిస్తున్న స్థావరాలపై రాజేంద్రనగర్ టాస్క్ఫోర్స్ పోలీసులు కొరడా ఝుళిపించారు. హైదరాబాద్ సిటీ, అత్తాపూర్, మైలార్దేవ్పల్లి లా అండ్ ఆర్డర్ పోలీసులతో కలిసి ఉమ్మడిగా నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి భారీ పరిమాణంలో బాణాసంచాను స్వాధీనం చేసుకున్నారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో దాడుల వివరాలు: 1.జలాల్ బాబా నగర్ (అత్తాపూర్): గుట్టుచప్పుడు కాకుండా.