ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాలపై ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ సంస్థ 'గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2026' నివేదికను విడుదల చేసింది. ఈ లిస్టులో మన హైదరాబాద్కు. ఈ లిస్టులో మన హైదరాబాద్కు 421వ స్థానం దక్కింది. ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ అవకాశాల పరంగా నగరానికి మంచి మార్కులే పడినప్పటికీ.. క్వాలిటీ ఆఫ్ లైఫ్, పర్యావరణం విషయాల్లో మాత్రం వెనుకబడిపోయింది. హైదరాబాద్ ఆర్థిక రంగంలో 248వ స్థానంలో, మానవ వనరుల విభాగంలో 241వ స్థానంలో నిలిచింది. నగరంలో ఉన్న మంచి విద్యాలయాలు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, ఉపాధి అవకాశాలు ఈ విభాగాల్లో మంచి ర్యాంక్ రావడానికి ప్రధాన కారణం.