మన్యంలోని అరకులోయ, ముంచంగిపుట్టు మండలాల్లో శుక్రవారం పర్యాటకులు సందడి చేశారు. అరకులోయలోని సందర్శిత ప్రాంతాలు, ముంచంగిపుట్టు మండలంలోని డుడుమ జలపాతం వ్యూపాయింట్ సందర్శకులతో కళకళలాడాయి. అరకులోయకు పోటెత్తిన సందర్శకులుకిటకిటలాడిన సందర్శిత ప్రాంతాలుపర్యాటకులతో కళకళలాడిన డుడుమ జలపాతం వ్యూపాయింట్అరకులోయ/ముంచంగిపుట్టు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): అరకులోయలో శుక్రవారం పర్యాటకులు.. స్థానిక సంస్థల నామినేషన్ల అభ్యర్థులు, మద్దతుదారులతో సందడి వాతావరణం నెలకొంది. దసరా సెలవులు పూర్తి అయినప్పటికీ పర్యాటకుల రద్దీ కొనసాగుతునే ఉంది. శుక్రవారం సందర్శిత ప్రాంతాలైన గాలికొండ వ్యూపాయింట్, సుంకరమెట్ట ఉడెన్బ్రిడ్జి, అరకులోయలో ట్రైబల్ మ్యూజియం, పద్మాపురం గార్డెన్ పర్యాటకుల తాకిడి కనిపించింది.