గిరిజన గ్రామాలలో అత్యవసర సమయాల్లో డోలీ మోత తప్పడం లేదు. అనారోగ్యంతో బాధపడుతున్నవారు, గర్భిణులను తరలించేందుకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో కిలోమీటర్ల మేర డోలీపై మోసుకురావలసి వస్తోందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని బొంగరం పంచాయతీ శివారు కుంబుర్ల గ్రామానికి రహదారి లేకపోవడంతో శుక్రవారం గర్భిణిని డోలీపై ఆస్పత్రికి తరలించారు. గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్‌కు సమాచారంరోడ్డు సౌకర్యం లేక రాలేకపోయిన అంబులెన్స్డోలీపై గోమంగి పీహెచ్‌సీకి తరలించిన గ్రామస్థులుపండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన గర్భిణిపెదబయలు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బొంగరం పంచాయతీ శివారు కుంబుర్ల గ్రామానికి చెందిన వంతాల చిట్టిబాబు భార్య కాంచనదేవి నిండు గర్భిణి.