ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారికంగా చేపట్టింది. హైకోర్టు ఆదేశాల మేరకు, సీబీఐ అడిషనల్ ఎస్పీ నేతృత్వంలోని ప్రత్యేక బృందం శుక్రవారం విజయవాడకు చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి.. హైకోర్టు ఆదేశాల మేరకు, సీబీఐ అడిషనల్ ఎస్పీ నేతృత్వంలోని ప్రత్యేక బృందం శుక్రవారం విజయవాడకు చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ ప్రత్యేక కోర్టులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటివరకు ఈ కేసును విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నుంచి కీలకమైన రికార్డులు, ఆధారాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.