‘కష్టకాలంలో జిల్లా కోడలిగా, ఆడబిడ్డగా మీ ముందుకు వచ్చా. నన్ను ఆశీర్వదించండి’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరారు. ఘన స్వాగతం: ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్న కవితకు జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడ్నుంచి జిల్లా కేద్రంలోని జాగృతి కార్యాలయానికి వాహన ర్యాలీతో చేరుకున్నారు. మార్గం మధ్యలో మహిళలు, జిల్లా పసుపు రైతులు సాదర స్వాగతం పలికారు. తొలిరోజు నిజామాబాద్ నుంచి నవీపేట మండలంలోని యంచ వరకు ‘జనం బాట’ కొనసాగింది. రెండోరోజు ఆదివారం ఉదయం మోపాల్ మండలం బైరాపూర్ రైతులను కవిత కలిసి పోడు భూముల సమస్యలను తెలుసుకోనున్నారు.