ఆనందపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్థానిక సంస్థల ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఎన్నికల పోలింగ్ నిర్వహణపై శిక్షణ తరగతులను. ఆనందపురం: ఆనందపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్థానిక సంస్థల ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఎన్నికల పోలింగ్ నిర్వహణపై శిక్షణ తరగతులను శుక్రవారం ఎన్నికల అధికారులు నిర్వహించారు. జిల్లా డిప్యూటీ కలెక్టర్ గోవింద శిక్షణ తరగతులను పరిశీలించారు. ఈ మేరకు భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం, పద్మనాభం, భీమిలి మండలాల్లో 44 ఎంపీటీసీ స్థానాలకు, మూడు జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 132 మంది పీవో, ఏపీవోలు శిక్షణా తరగతులకు హాజరయ్యారు.