పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని నక్సల్స్ ఫ్రీ తెలంగాణగా మార్చామని ఉద్ఘాటించారు. హైదరాబాద్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. దక్షిణాది రాష్ట్రాల పోలీస్ సమన్వయ కమిటీ భేటీ ఈరోజు (శుక్రవారం) హైదరాబాద్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్రెడ్డి, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళం డీజీపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.తమ హయాంలో హైడ్రా, ఈగల్, ఈజీ సేఫ్ ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు.