Hyderabad Metro Loans : మెట్రోరైలును ప్రభుత్వం స్వాధీనం చేసుకొనేందుకు ఏడాదిపాటుగా ప్రయత్నాలు చేస్తోంది. కానీ తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే సంస్థలు దొరకకపోవటంతో జాప్యం జరుగుతోంది. Hyderabad Metro Loans : హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశను పబ్లిక్ - ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనుకుంది. చివరి నిమిషంలో ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ రుణం విడుదల చేయకపోవడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. దసరా నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నా, 3.5 శాతం వడ్డీకి రుణమిచ్చే సంస్థలు దొరకలేదు.