తిరుపతి రూల్ జడ్పీటీసీ స్థానంలో సమీప టీడీపీ అభ్యర్థి ముచ్చెలి ధనలక్ష్మిపై హర్షిత్ రెడ్డి విజయం సాధించారు. కేవలం 602 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. తన కుమారుడు హర్షిత్ రెడ్డి గెలుపుపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. మెజార్టీ ఖరారైన తర్వాత కూడా అధికారులతో డిక్లరేషన్ ఇప్పించడంలో ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారని ఆయన ఆరోపించారు. నామినేషన్ల దశ నుంచే ప్రత్యర్థులు దాడులు, బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన అన్నారు. ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా ప్రజలు మాత్రం వైసీపీ పక్షానే నిలిచారని ఆయన అన్నారు.