Gautam Gambhir Coaching: టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జట్టులో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. యువ ఆటగాళ్లకు అవకాశాలు పెరిగాయి. అయితే ఒకప్పుడు భారత జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్న ముగ్గురు స్టార్లకు మాత్రం క్రమంగా అవకాశాలు తగ్గుతున్నాయి. రింకూ సింగ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ పరిస్థితి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అప్పటి నుంచి భారత జట్టు ఆటతీరులో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తూ భవిష్యత్తు జట్టును సిద్ధం చేసే ప్రయత్నం జరుగుతోంది. అయితే ఈ మార్పుల ప్రభావం కొందరు సీనియర్ ఆటగాళ్లపై పడినట్లు కనిపిస్తోంది.