హైదరాబాద్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌలిదొడ్డి ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణ ఘటన ఆదివారం ఉదయం 8:40 గంటలకు జరిగింది. కుటుంబ సభ్యులు బాతుల మరెడ్డి (65), బాతుల భారతి (60), బాతుల నిషాంత్ రెడ్డి (38)గా గుర్తించబడ్డారు. ఈ కుటుంబం గత సంవత్సరం జయభేరి నిర్వాణ అపార్ట్మెంట్స్ లోని C బ్లాక్ లో ఫ్లాట్ నంబర్ 702 లో నివసిస్తోంది.