బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 తొమ్మిదో వారం ఎలిమినేషన్ లో భాగంగా సుధీర్ లేదా యాంకర్ వర్షిణీ ఎవరో ఒకరు హౌస్ నుంచి బయటకు పోవచ్చని ప్రచారం జరిగింది. డబుల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరూ బ్యాగ్ సర్దేసుకోవాల్సిందేనని వార్తలు వచ్చాయి. అయితే ఇంతలోనే ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 తొమ్మిదో వారం చివరి దశకు చేరుకుంది. గత రెండు వారాల్లాగే ఈసారి కూడా హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని భావించారు. ఈ వారం ఎలిమినేషన్ కు సంబంధించి మొత్తం 10 మంది కంటెస్టెంట్లు నామినేషన్స్ లో ఉన్నారు.