SRH Retention List: ఐపీఎల్ 2027కు ముగ్గురు ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్న SRH.. ఇప్పుడు రిటెన్షన్ జాబితాపై దృష్టి పెట్టింది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి స్టార్లను కొనసాగిస్తూ, పాట్ కమిన్స్ సహా పలువురిని విడుదల చేసే అవకాశం ఉందనే ప్రచారం ఆసక్తి రేపుతోంది. SRH Retention List: ఐపీఎల్ 2027 (IPL 2027) మినీ వేలానికి సమయం దగ్గరపడుతోంది. డిసెంబర్ 16న గోవాలో వేలం జరిగే అవకాశం ఉండటంతో పది ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు ఎంపికపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.