మనిషి శరీరం ఇప్పుడు ఒక వ్యాపార వస్తువుగా మారిపోయింది. మన గుండె ఎన్ని సార్లు కొట్టుకుంటోంది, మనం ఎన్ని గంటలు నిద్రపోతున్నాం, ఎంత శక్తిని ఖర్చు చేస్తున్నాం.. ఇలా మన శరీరానికి సంబంధించిన ప్రతీ సమాచారానికి మార్కెట్లో ఒక ధర ఏర్పడుతోంది. ఆరోగ్యంపై మనుషుల్లో పెరుగుతున్న ఆందోళనను కొత్త వ్యాపార అవకాశంగా మార్చుకుంటున్నారు. ఈ వ్యాపారానికి ఇప్పుడు సైన్స్ అనే ముసుగు కూడా తోడైంది. ఒకప్పుడు బాబాలు అద్భుతమైన వైద్య రహస్యాలు తమకు మాత్రమే తెలుసని చెప్పేవారు..