Sonia Gandhi: బాబ్రీ మసీదు (Babri Masjid) కూల్చివేత ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. 1992లో అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసం జరిగినప్పుడు, ఆ దృశ్యాలను టెలివిజన్లో చూసి తన కళ్లలో నీళ్లు తిరిగాయని సోనియా గాంధీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీనిపై భారతీయ జనతా పార్టీ (BJP) అత్యంత ఘాటుగా స్పందించింది. అప్పట్లోనూ, ఇప్పుడు కూడా కాంగ్రెస్ హృదయంలో బాబర్ (Babur) జీవించే ఉన్నాడని బీజేపీ ధ్వజమెత్తింది.