తిరుపతి రూరల్ జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌పై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, రీకౌంటింగ్ కోరే అవకాశం ఉన్నప్పటికీ మానవతా దృక్పథంతో వెనక్కి తగ్గామని వెల్లడించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు బతిమాలడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. అయితే రీకౌంటింగ్ వదులుకోవడం తప్పు నిర్ణయమని ఇప్పుడు భావిస్తున్నట్లు సుధా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కౌంటింగ్.