Cheyutha Pension: రాష్ట్రంలోని నిరుపేదలు, అణగారిన వర్గాలకు ప్రభుత్వం దీపావళి కానుకగా 'చేయూత' పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల మందికి కొత్త పింఛన్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. నేడు (ఆదివారం) కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. దశాబ్దాలుగా లేదా ఏళ్ల తరబడి నిలిచిపోయిన ఈ పింఛన్ల పంపిణీకి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన, సెర్ప్ ప్రత్యేక డ్రైవ్లు, వార్డు, గ్రామసభలు, క్షేత్రస్థాయి పరిశీలన, ఆధార్ సీడింగ్ ద్వారా ప్రక్రియ పూర్తి చేశారు. కొత్త పింఛన్ల కోసం మొత్తం 5,98,193 దరఖాస్తులు రాగా, అందులో నిబంధనల ప్రకారం అర్హులైన 4.