Tragedy: హైదరాబాద్ మహానగరంలోని ఐటీ కారిడార్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌలిదొడ్డిలో ఆదివారం ఉదయం ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. పాలమూరు జిల్లా అచ్చంపేట మండలం తల్లాచెరువు గ్రామానికి చెందిన బత్తుల మర్రెడ్డి (65), ఆయన భార్య బత్తుల భారతి (60), వీరి కుమారుడు బత్తుల నిషాంత్ రెడ్డి.