చాలా మందికి చపాతీల్లోకి మంచి కర్రీ కావాలి అనుకుంటారు. అయితే ఎప్పుడూ చేసుకునే విధంగా ఆలు, టమాటా కర్రీ కాకుండా, ఇప్పుడు మనం బఠానీ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రకంగా కర్రీ వండితే రుచి అదిరిపోతుందంట. కావాల్సిన పదార్థాలు : టమాటాలు, పచ్చి మిర్చి, ఉల్లిపాయలు తరిగినవి, కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు రుచికి సరిపడ.