వేల ఏళ్ల చరిత్ర.. తరతరాలకు అందిన విజ్ఞానం.. ప్రపంచానికి మార్గనిర్దేశం చేసిన జీవన విలువలు.. ఇవన్నీ మన ప్రాచీన భారతీయ గ్రంథాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. మూడు గొప్ప ప్రాచీన గ్రంథాలను యునెస్కో తన 'మెమరీ ఆఫ్ ది వరల్డ్' ఆసియా-పసిఫిక్ ప్రాంతీయ రిజిస్టర్లో చేర్చింది. అవేంటంటే.. మహాభారతం, కౌటిల్యుడి అర్థశాస్త్రం, కల్హణుడు రచించిన రాజతరంగిణి. చరిత్ర, తత్వశాస్త్రం, రాజ్యపాలన అంశాలను ప్రపంచానికి పరిచయం చేసిన ఈ గ్రంథాలకు దక్కిన గుర్తింపు భారతీయులకి గర్వకారణంగా నిలుస్తోంది.