Kedareswara Vratham Puja Vidhanam Telugu: దీపావళి రోజున కేదారేశ్వర వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తారు? ఈ వ్రతంలో 21 సంఖ్యకు ఉన్న ప్రత్యేకత ఏమిటి? పార్వతీదేవి అర్థనారీశ్వరి రూపాన్ని పొందడానికి ఆచరించిన ఈ వ్రతం పూజా విధానం, కావాల్సిన సామగ్రి, పురాణ విశిష్టత తెలుసుకోండి. Kedareswara Vratham Puja Vidhanam Telugu: హిందూ సంప్రదాయంలో ఆశ్వయుజ బహుళ అమావాస్యకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఈ పవిత్రమైన తిథినే దీపావళి పండుగను జరుపుకుంటారు. 2026లో దీపావళి నవంబర్ 8న ఆదివారం వచ్చింది. ఈ రోజున లక్ష్మీపూజతో పాటు శివపార్వతులకు సంబంధించిన కేదారేశ్వర వ్రతాన్ని కూడా భక్తిశ్రద్ధలతో ఆచరించే సంప్రదాయం ఉంది.