ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది తమ పిల్లలు చాలా యాక్టీవ్‌గా , తెలివైన వారిగా ఉండాలి అనుకుంటారు. మరీ మీ పిల్లలు తెలివైన వారేనా? అసలు పిల్లలు తెలివైన వారో, కాదో ఎలా తెలుసుకోవాలి అంటే?వారి ప్రవర్తనను గమనించడం ద్వారా వారి ఐక్యూని చాలా త్వరగా అర్థం చేసుకోవచ్చు అని చెబుతున్నారు నిపుణులు. మీ బిడ్డ మాట్లాడే విధానం తన మెమరీ పవర్‌ను తెలియజేస్తుంది. పదాలను ఎలా గ్రహిస్తున్నాడు, స్పష్టంగా పలుకుతున్నాడా లేదా? ఒక పదం మీరే పదే పదే చెప్పాల్సి వస్తుందా ?