ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలకు వేదికయ్యాయి. ముఖ్యంగా వైఎస్సార్సీపీ సీనియర్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యుల పోటీపై అందరి దృష్టి నెలకొంది. ఒకే కుటుంబం నుంచి నలుగురు జడ్పీటీసీ స్థానాల కోసం ప్రయత్నించగా, చివరకు ఒకరి నామినేషన్ తిరస్కరణకు గురైంది. పోటీలో నిలిచిన వారిలో కుమార్తె బొత్స అనూష ఓటమి పాలవగా, కోడలు బొత్స పూజిత విజయం సాధించారు.