Sabarimala Portal Online Services: శబరిమల అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. యాత్రికుల సౌకర్యార్థం కొత్తగా 'శబరి పోర్టల్' ప్రారంభించింది. దర్శన సమయాలు, వర్చువల్ క్యూ బుకింగ్, వైద్య సేవలు, రవాణా సమాచారం, పోగొట్టుకున్న వస్తువుల ఫిర్యాదులు సహా అన్ని వివరాలను ఒక్క క్లిక్‌తో తెలుసుకోవచ్చు. పరిమిత సంఖ్యలో శబరిమల అయ్యప్ప దర్శనానికి స్పాట్ బుకింగ్ సౌకర్య ఉంది.