గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత తొమ్మిదేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా భారీ ఎత్తున గంజాయి దందా సాగిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును నార్కోటిక్స్ పోలీసులు రట్టు చేశారు. వరుస మాదకద్రవ్యాల నేరాలకు పాల్పడుతున్న నానక్‌రామ్‌గూడకు చెందిన కాలాపతి నీతూ బాయి (51)ని హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్, తెలంగాణ ‘ఈగల్’ (EAGLE) ఫోర్స్ టెక్నికల్ బృందం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో అరెస్ట్ చేశాయి. నిందితురాలిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఆమె అరెస్ట్ సమయంలో రూ.1,59,500 నగదు,.