North Korea Cyber Army: చేతుల్లో తుపాకులు పట్టుకోరు.. యుద్ధ ట్యాంకులు నడపరు. కేవలం కంప్యూటర్ల ముందు కూర్చుని ప్రపంచ దేశాల బ్యాంకులు, సంస్థలను వణికిస్తున్నారు. వారే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రహస్యంగా తయారు చేసిన ‘సైబర్ సైన్యం’. ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ప్లాట్ఫామ్ ‘బైనాన్స్’పై పడి ఏకంగా 6 బిలియన్ డాలర్లు (దాదాపు 50 వేల కోట్ల రూపాయలు) కొట్టేయడంతో ఈ ముఠా ఎంత ప్రమాదకరంగా మారిందో మరోసారి స్పష్టమైంది..