Tesla Cybertruck: నాలుగు సంవత్సరాలు కూడా తిరక్కముందే కథ ముగిసింది.. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) తన ప్రతిష్టాత్మక 'సైబర్ ట్రక్' (Cybertruck) ఉత్పత్తిని నిలిపివేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది. 2027 నాటికి టెక్సాస్ గిగాఫ్యాక్టరీలో (Texas Gigafactory) ఈ సైబర్ ట్రక్ ప్రొడక్షన్ పూర్తిగా బంద్ అవుతుందని కంపెనీ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) స్వయంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. 2023లో మార్కెట్లోకి వచ్చి ప్రొడక్షన్ ప్రారంభించిన కేవలం మూడేళ్లలోనే టెస్లా ఈ నిర్ణయానికి రావడం ఆటోమొబైల్ రంగాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.