Israel Politics: ఒక్క ఆదేశంతో పశ్చిమాసియా ముఖచిత్రాన్నే మార్చేసిన దేశం.. సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో నిద్రపోయిన మిలిటరీ సూపర్ పవర్.. అదే ఇజ్రాయెల్. ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న అసలైన ప్రశ్న ఒక్కటే “మిడిలీస్ట్ను వణికించిన ఈ దేశానికి నెక్ట్స్ బాస్ ఎవరు?. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు పశ్చిమాసియా రాజకీయాలను అత్యంత ఉత్కంఠభరితమైన మలుపు తిప్పాయి. 120 స్థానాలున్న ఇజ్రాయెల్ పార్లమెంట్ (క్నెసెట్)లో అధికార పగ్గాలు చేపట్టడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 61..