PM Modi: దీపావళి పర్వదినం వేళ ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రతి ఏటా దేశం గర్వించే వీర జవాన్ల సమక్షంలో పండుగ జరుపుకునే తన సంప్రదాయాన్ని ఈసారి కూడా కొనసాగించబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కుటుంబాలకు దూరంగా గడ్డకట్టే చలిలో దేశ రక్షణే ధ్యేయంగా నిలిచే సైనికులతో కలిసి దీపావళి జరుపుకోవడమే తనకు అసలైన వేడుక అని ప్రధాని వెల్లడించారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా విడుదల చేసిన ఓ ప్రత్యేక.