పరిషత్ ఎన్నికల్లో కూటమి జైత్రయాత్ర ప్రజా విజయానికి నిదర్శనమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అభివర్ణించారు. విశాఖపట్నం: పరిషత్ ఎన్నికల్లో కూటమి జైత్రయాత్ర ప్రజా విజయానికి నిదర్శనమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అభివర్ణించారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో అభివృద్ధికి, సంక్షేమానికి పట్టం కడుతూ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చిన ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలియజేశారు. భీమిలి, ఆనందపురం, పద్మనాభం జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా గెలుపొందిన విజేతలకు అభినందనలు తెలిపారు. సమస్యల పరిష్కారంలో ముందుండి ప్రజలకు సుపరిపాలన అందించాలని సూచించారు. విశాఖను విశ్వనగరంగా అభివృద్ధి చేయడంలో భాగస్వామ్యం కావాలన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.