Hyderabad: ఒడిశాలోని నైనీ గని నుంచి రోజుకు 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతి ఆదేశం. ఎల్నినో నేపథ్యంలో ప్రత్యేక కార్యాచరణ. హైదరాబాద్: ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు గని నుంచి బొగ్గు ఉత్పత్తి, రవాణాను మరింత వేగవంతం చేయాలని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని నైనీ గని నుంచి తెలంగాణకు రోజుకు కనీసం 20 వేల టన్నులకు పైగా బొగ్గు సరఫరా చేసేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని.