నగరంలో నకిలీ ఆపిల్ ఐఫోన్ ఉత్పత్తుల విక్రయాల గుట్టురట్టయింది. ఒరిజినల్ ఐఫోన్లు, ఆపిల్ వాచీలు, ఇయర్‌బడ్స్ అంటూ నకిలీ వస్తువులను ఓ ముఠా విక్రయిస్తోంది. హైదరాబాద్, నవంబర్ 7: నగరంలో నకిలీ ఆపిల్ ఐఫోన్ ఉత్పత్తుల విక్రయాల గుట్టురట్టయింది. అమాయక ప్రజలను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతోంది. పక్కా సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు తనిఖీ నిర్వహించగా అసలు బండారం బయటపడింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఆవేష్ ఖాన్, అల్తమాష్ ఈ నకిలీ ఐఫోన్లను అమాయక ప్రజలకు అంటగడుతున్నారని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లోని మలక్‌పేట్ సైద్నగర్లో నివాసముంటున్న నిందితుడు అల్తమాష్(26)ను రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.