దక్షిణ భారత నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేలా కొత్త హైస్పీడ్ రైలు కారిడార్ల ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. బెంగళూరు–చెన్నై మధ్య ప్రయాణం 73 నిమిషాలకు, బెంగళూరు–హైదరాబాద్ మధ్య 2 గంటల 10 నిమిషాలకు తగ్గే అవకాశం ఉందని సమాచారం. 2026-27 కేంద్ర బడ్జెట్లో ఏడు హైస్పీడ్ కారిడార్లను ప్రకటించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల మధ్య రవాణా, వ్యాపార సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయి.