ఉద్యోగం పోయిందంటే.. కొత్త ఉద్యోగం ఎప్పుడు దొరుకుతుందో తెలియకపోవడం.. కుటుంబ ఖర్చులు ఎలా భరించాలన్న టెన్షన్ వెంటాడతాయి. అందుకే ఏ కంపెనీ అయినా ఉద్యోగులను తొలగిస్తోందంటే తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఓ ప్రముఖ టెక్ కంపెనీ అనుసరించిన విధానంతో ప్రశంసలు అందుకుంటోంది. ప్రయోజనాల జాబితా చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ గ్రాఫిక్ డిజైన్ ప్లాట్ఫామ్ కాన్వా (Canva) పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. మొత్తం ఉద్యోగుల్లో 22 శాతం మంది అంటే 1,271 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. కాన్వా ప్రారంభమైన 13 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యంత కఠినమైన సమయమని సంస్థ సీఈఓ మెలానీ పెర్కిన్స్ తెలిపారు.