హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. వ్యాపార పనుల నిమిత్తం హైదరాబాద్ వచ్చిన అమెరికాకు చెందిన ఓ వ్యక్తి హోటల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హోటల్ సిబ్బంది సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ఓ అమెరికా పౌరుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. వ్యాపార పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన వ్యక్తి హోటల్ గదిలోనే విగతజీవిగా కనిపించాడు. గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ టెర్మినస్‌లో ఉన్న మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్‌మెంట్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.