దీపావళి పండుగ అంటేనే తీపి వంటకాలు, పండుగ సంబరాలు. ఈ ప్రత్యేక సందర్భంలో లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించే బెల్లం పొంగడాలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. సాధారణంగా పొంగడాలు తయారుచేయాలంటే పాకం పట్టడం, తడి పిండి చేసుకోవడం వంటివి చాలామందికి కష్టంగా అనిపిస్తాయి. అయితే, సులభమైన పద్ధతిలో ఎవరైనా చాలా తేలికగా, తక్కువ శ్రమతో, అద్భుతమైన రుచితో ఈ పొంగడాలను సిద్ధం చేసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు: బియ్యం: 2 కప్పులు , తురిమిన బెల్లం: 2 కప్పులు, గోధుమ పిండి / మైదా పిండి: 1/4 కప్పు (పిండి పల్చదనాన్ని బట్టి), నెయ్యి: 1 టేబుల్‌స్పూన్, ఎండు కొబ్బరి ముక్కలు: 1/2 కప్పు.